- కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అభినందనలు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గూడెం గ్రామంలో నూరు శాతం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు పూర్తవ్వగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జి కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ యువజన మండలాద్యక్షుడు గూడల్లి శ్రీకాంత్ ను శభాష్ అంటూ అభినందించారు.ప్రతి కాంగ్రెస్ పార్టీ బూత్ బాధ్యులు శ్రీకాంత్ ను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు పూర్తి చేయాలని సత్యనారాయణ సూచించారు.అనంతరం మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఐలేని తిరుపతి రెడ్డి, బేగంపేట,లక్ష్మీపూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 08:33PM