నవతెలంగాణ కంటేశ్వర్
హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్. జూమ్ మీటింగ్ మంగళవారం నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్ లో నిజామాబాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే 48 పోలీస్ స్టేషన్లను గుర్తించారని, బ్లాక్ స్పాట్లను ఎల్లప్పుడు తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే స్పీడ్ కంట్రోల్ చేయడం, బ్లాక్ స్పాట్లను పునర్వవస్థీకరించాలని, రోడ్డు ప్రమాదాలను అరికట్టుటలో జాతీయ రహాదారులలో, స్పీడ్ లిమిట్ డిస్ప్లేల బోర్డులను ఏర్పాటు చేయడం, జాతీయ రహాదారులలో పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపర్చాలని సూరించారు.
సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరానికి అనుకూలంగా రేడియం స్టిక్కర్లను అంటించాలని సూచించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్., డిప్యూటి కమీ షనర్ ఆఫ్ పోలీస్ వి. అరవిందాబాబు, ఆర్ అండ్ బి (ఇ.ఇ) వి. రామ్బాబు, ఎన్.హెచ్.ఎ.ఐ (44) కన్సల్టెంటు టి. రామారావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ట్రాఫిక్ ఎ.సి.పిలు ఎ.వెంకటేశ్వర్లు, రఘు రామారావు, ప్రభాకర్ రావ్, స్పెషల్ బ్రాంక్ఇన్పెక్టర్స్ రాఘవేంధర్, సి.ఐలు, ఎస్.ఐలు సి.సి.ఆర్.బి ఎస్.ఐలు చాందయ్య ఎమ్.డి. ముఖీద్ పాషా, వర్టికల్ అఫీసర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 08:36PM