- మండలంలో ప్రత్యేక సభ్యత్వ నమోదును పరిశీలించిన కవ్వంపల్లి
- సభ్యత్వ నమోదులో కృషి చేసిన బాద్యులకు శాలువాతో సన్మానం
నవతెలంగాణ-బెజ్జంకి
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు కేటాయించిన బూత్ స్థాయి బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి విసృతంగా సభ్యత్వాలను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు,మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జి కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు.మండలంలోని రేగులపల్లి, జీల లింగం (105), కల్లేపల్లి, గోసికొండ సాయి కిరణ్ రెడ్డి (101), గూడెం గూడెల్లి శ్రీకాంత్ (102), బేగంపేట శీలం నర్సయ్య(254), లక్ష్మీపూర్ చిలువేరు రాజిరెడ్డి (203), గాగీల్లపూర్ ఎర్రోల్ల రాజు(122),ముత్యం శ్రావణ్ (103) సభ్యత్వ నమోదులు పూర్తి చేయగా వారిని కవ్వంపల్లి అభినందించి శాలువాతో సన్మానించారు. మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శానాగొండ శ్రావణ్, పులి కృష్ణ, మానాల రవి, దోనే వేంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 Jan,2022 02:55PM