- బీఎస్ఎఫ్ అధ్యక్షుడు కళ్లేపల్లి ప్రశాంత్
విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు ప్రకటించిన సెలవుల నుంచి యూనివర్సిటీలను మినహాయించాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు కళ్లేపల్లి ప్రశాంత్ సీఎం కేసీఆర్ ను కోరారు. వరుస సెలవులతో యూనివర్సిటీలలో పరిశోధన కుంటుపడుతున్నాయని అన్నారు. ఆన్లైన్ బోధన సంతృప్తి కరంగా లేదని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యా విద్యార్థులకు లభించడం లేదని అభిప్రాయపడ్డారు. వర్సిటీ విద్యార్థులు రెండు డోసుల టీకాలు తీసుకోని ఉన్నారని కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతి గది బోధనతో విద్యని కొనసాగించాలని సీఎం కేసిఆర్ కి విజ్ఞప్తి చేసారు. మిగితా అన్ని రంగాలు పనిచేస్తుండగా కేవలం విద్యారంగానికి మాత్రమే సెలవులు ఎందుకని ప్రశ్నించారు. బార్లు వైన్స్ ల మీద ఉన్న శ్రద్ధ పాఠశాలపై ఎందుకు లేదని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 Jan,2022 02:57PM