- 25 కుటుంబాలకు ట్రాఫిక్ సీఐ కౌన్సెలింగ్
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 12 గురిపై కేసు నమోదు చేసుకొని 25 మందికి బుధవారం నిజామాబాద్ నగరంలోని టి టి ఐ కౌన్సిలింగ్ సెంటర్ లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే పరిణామాల గురించి, ప్రమాదాల గురించి వీడియో ద్వారా వివరించారు. వాహనదారులు ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని క్లుప్తంగా వివరించారు. కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులలో కోరారు. ఒకవేళ అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు మాస్క్ లను సైతం తప్పనిసరిగా ధరించాలని సూచించారు లేనియెడల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లు శంకర్, ప్రదీప్ కుమార్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది అలాగే మద్యం సేవించి పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 Jan,2022 03:08PM