నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నగరంలోని ప్రెస్ క్లబ్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడపుల రామకృష్ణ మాట్లాడుతూ మాక్లూర్ మండల పరిధిలో పనిచేస్తున్న 'సాక్షి' దినపత్రిక విలేకరి కమలాపురం పోశెట్టి పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుని కుమారుడు గోపు రంజిత్, నందిపేట్ లక్కంపల్లి సర్పంచ్ భర్త అయిన మూడ మహేందర్ ల ప్రోద్భలంతో ముగ్గురు వ్యక్తులు మోసీన్, ప్రసాద్, సురేష్ లు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టినారు అని తెలిపారు. దీంతో పోశెట్టి అక్కడికక్కడ క్రింద పడిపోయాడు, అతనిని చంపే ప్రయత్నం చేయగా కేకలు పెట్టడంతో సమీపంలో వ్యవసాయ పనులు చేసుకొంటున్న కూలీలు వచ్చి దాడిచెస్తున్నా వారి నుండి కాపాడి పోశెట్టిని కపడినారు. ఈ దుస్సాహసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 Jan,2022 04:21PM