నవతెలంగాణ కంటేశ్వర్
కార్మిక కర్షక ఐక్యత కు స్ఫూర్తి దినమైన 1982 జనవరి 19 స్ఫూర్తితో ఫిబ్రవరి 23 ,24 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ నగరంలోని తొలిసారి జరిగిన 1982 జనవరి 19 కార్మిక కర్షక ఐక్యతకు స్ఫూర్తి దినం సందర్భంగా సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా జరిగిన సార్వత్రిక సమ్మె సందర్భంగా 10 మంది కార్మికులు చనిపోవడం జరిగింది అని 32 మంది తీవ్రగాయాలతో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం జరిగిందని అని అన్నారు. ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో వారణాసి- మిర్జాపూర్ రోడ్డు లో జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా అక్కడికక్కడే రైతు నాయకు లు బోలా పాశ్వాన్ మరణించడం జరిగింది. అని అయినా ఆయన సోదరుడు విద్యార్థి సంఘం నాయకుడు అయిన లాల్చంద్ పాశ్వాన్ ఆ ప్రదర్శన ను ముందుకు నడిపించడం జరిగిందని అన్నారు దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరు మా జ్ఞానం గ్రామంలో పోలీసుల కాల్పుల్లో అంజన్. నా గురన్ మరణించడం జరిగింది అని ఉన్నారు అలాగే తిరుత్తని ఉండి గ్రామంలో గుణశేఖరన్ మరణించడం జరిగింది. అని అన్నారు వ్యవసాయ కార్మికులకు వేతనాలు పెంచాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఆరోజు ఆందోళన చేయడం జరిగిందని నేటికీ అదే సమస్యలపైన రైతులు గత సంవత్సర కాలంగా వ్యవసాయ రంగంలో తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేసి700మంది రైతులు ప్రాణత్యాగం చేసి విజయం సాధించడం జరిగిందని రైతు పోరాటానికి కార్మికులకు అండగా నిలవడం వల్లే విజయం సాద్య్హమైందని రేపు ఫిబ్రవరి 23,24నజరుగు సార్వత్రిక సమ్మె కార్మికుల నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ రద్దు కొరకు జరుగుతుందని. ఈ సమ్మెకు ఇప్పటికే రైతు సంఘాలు మద్దతు పలికిన విషయం అందరికి తెలిసిందే కావున రైతులు, కార్మికులు వ్యవసాయ కార్మికులు, సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయ వలసిన అవసరం ఉందని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు కె రమేష్ బాబు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ ఐద్వా జిల్లాప్రధానకార్యదర్శిసబ్బని లత, సూరి, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి శిల్ప లింగం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టి సూరి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, విగ్నేష్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజు, శంకర్, సీఐటీయూ జిల్లా నాయకులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 Jan,2022 05:58PM