నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నవంబర్ నెలలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్ లో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్ఎస్ యువ నాయకులు దాదన్నగారి సందీప్ రావు, గాంధారి మండల నాయకులు సత్యంరావు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm