నవ తెలంగాణ కంటేశ్వర్
ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి త్రివేణి అన్నారు. ఈ మేరకు బుధవారం కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి ఈ సందర్భంగా నిర్వహించిన పుష్పార్చన-కవి సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహారాష్ట్ర అనుబంధాలను తమ కథలలో అచ్చమాంబ చక్కగా వివరించారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కవయిత్రి డాక్టర్ ఆరుట్ల శ్రీదేవి మాట్లాడుతూ.. ఆధునిక భావాలున్న మహిళలందరికీ అచ్చమాంబ సాహిత్య జీవనం ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్, కె.వి.రమణాచారి, మద్దుకూరి సాయిబాబు, డి నవీన్, కొయ్యాడ శంకర్, రమావత్ కిరణ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భండారు అచ్చమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.