నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం మహ్మదపుర్ గ్రామానికి చెందిన బండోజు రవింద్ర చారి కుమారుడు ఆదర్శ్ (21), పోతారం(ఎస్) లో కర్నకంటి ఆగవ్వ ,బత్తుల భూలక్ష్మి కుటుంబ సభ్యులను బుధవారం సిపిఐ రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరమార్శించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. నాయకులు గడిపె మల్లేశ్, యెడల వనేశ్, అయిలేని సంజివరెడ్డి,ఎగ్గోజు సుదర్శన్ చారి, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఎనగందుల లక్ష్మి నారాయణ, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల ప్రసాద్, ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm