-మండల అఖిలపక్షం నాయకుల డిమాండ్
-తరలిన గురుకుల పాఠశాలను యథాతథంగా తీసుకురావాలని సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
గతంలో మండలంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హారీష్ రావు పర్యటించి మండలాభివృద్థికోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీలిచ్చి మర్చిపోయారని ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు.బుదవారం మండల కేంద్రంలోని స్థానిక సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్షం నాయకులు మాట్లాడారు.గతంలో మండలంలోని తోటపల్లి గ్రామంలో గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి భవన నిర్మాణంలో అలసత్వం వహించడం వల్ల సరైన వసతులు లేక హుస్నాబాద్ తరలిపోయిందని..తరలిన గురుకుల పాఠశాలను యథాతథంగా మండలానికి తీసుకురావాలని,బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో 100 పడకల ఆస్పత్రి హామీ అటకెక్కిందని 22న చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.