-50 కిలోల చోప్పున బియ్యం, వెయ్యి నగదు అందజేత
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన బోనగిరి బుచ్చయ్య, నల్లగొండ జయాకర్ ల కుటుంబ సభ్యులను గురువారం బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్ చార్జి గడ్డం నాగరాజు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.తన వంతు సహాయంగా 50 కిలోల చోప్పున బియ్యం,రూ.1000 నగదు అందజేశారు.బీజేపీ మండల అధికార ప్రతినిధి బోనగిరి మహేష్,గ్రామస్థులు బోనగిరి రమేష్,ప్రశాంత్, ఓంకార్,ఆదర్శ్,సాయి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm