మాదిగ జేఏసి ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి
నవతెలంగాణ-గోవిందరావుపేట.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన డాక్టర్ పిడమర్తి రవి ని ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించాలని మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి టిఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం మండలం పసర గ్రామం లో మాదిగ జేఏసీ అత్యవసర సమావేశం గంగారపు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల. మురళి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలు జీవితం, వందల కేసులు ఎదుర్కొని ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా ఉద్యమ కెరటం డాక్టర్ పిడమర్తి రవి కి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ముఖ్య మంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లో అతి పెద్ద కులమైన మాదిగలకు నాయకత్వం వహిస్తు టీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఏకైక నాయకుడు పిడమర్తి రవి అని పేర్కొన్నారు. పిడమర్తి రవి కి నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని.. కానీ మాదిగలకు సముచిత స్థానంకల్పించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రవి కి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రదీప్, జెమిని రవి, అభిరామ్, రవీందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 Jan,2022 04:01PM