- అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి
- సిద్దిపేట రూరల్ టిఆర్ఎస్వి కమిటీ ని ప్రకటించిన మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ -సిద్దిపేట రూరల్
టిఆర్ఎస్ లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు గురువారం సిద్దిపేట రూరల్ మండలం తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్తి విభాగం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రూరల్ మండల అధ్యక్షునిగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ ,అదేవిధంగా రాంపూర్ గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డిని మండల సమన్వయ కర్తగా నియమించారు. ఈ సందర్భంగా వారు రు మాట్లాడుతూ పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని , ఉద్యమం లో విద్యార్థులు పాత్ర గొప్పది అని , అదే పంథాలో పార్టీ లో క్రియాశీలకంగా ఉండాలని , ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బాధ్యత మీ పై ఉందని సూచించారు. బిజెపి చేస్తున్న ఫెక్ ప్రచారాలని తిప్పికొట్టాలని బిజెపి అంటే అబద్ధాల పార్టీ అని ఎద్దవా చేశారు.కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఉడగొడుతుందని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణలో లక్షా 37 వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిందని , మరో 70వేల పైగా ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయన్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 20 Jan,2022 06:22PM