నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల బి.ఎల్.ఎఫ్ జిల్లా కార్యాలయం ఎదుట బి ఎల్ ఎఫ్ నాల్గవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బి ఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ ఆ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫూలే అంబేద్కర్, మార్క్సిజం ఆలోచనా విధానంతో 2018లో ఆవిర్భవించిన బి ఎల్ ఎఫ్ 93 శాతం మున్న బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమి స్తోందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీ.సీ లకు వ్యతిరేకంగా పాలనను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. బిసి జనగణన చేయడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. మెజారిటీతో బహుజన ప్రజలు అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.సిద్ధిరాములు, రాజశేఖర్, జిల్లా నాయకులు కాంబ్లే మధు, శ్రీనివాస్,దండు జ్యోతి, సుజాత, జగదీష్, హైమద్ కార్యకర్తలు పాల్గొన్నారు.