నవతెలంగాణ-ధర్మసాగర్
స్వీయ నియంత్రణ శ్రీరామరక్ష అని నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డి అన్నారు గురువారం ఆయన బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించి పోలేదని కరోనా నుండి రక్షణ పొందడానికి వ్యాక్సిన్ వేసుకోవడమే ఉన్న ఏకైక మార్గమని, అందుకోసం గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలియజేస్తూ, ఇప్పటికే గ్రామంలో మొదటి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం 100% పూర్తిచేశామని, నిర్ణీత సమయం పూర్తయిన వారు రెండవ డోసు కూడా వేసుకొని తమను తాము రక్షించుకోవలని ఈ సందర్భంగా తెలియజేశారు.కరోనా మహమ్మారి మూడోదశ విస్తరిస్తున్న ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, రఘు పాల్ రెడ్డి, ఆశావర్కర్లు, ఏఎన్ఎం లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.