నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని మిర్చికంపౌండ్ కు చెందిన బక్కోళ్ళ రాములు(51) మధ్యాహ్నం ఆసుపత్రిలోని మూడవ అంతస్తు నుంచి దూకాడు. తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. రాములు ఈ నెల 18న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. మధ్యాహ్నం ఇన్ పేషెంట్ వార్డులో వైద్యులు, సిబ్బంది లేని సమయంలో ఆసుపత్రి బాల్కానీపై దూకి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితుడి కూతురు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm