నవతెలంగాణ-మానకొండూర్
సీఎం కేసీఆర్ మెప్పు పొందడానికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కొండపల్కల ఎంపిటిసి గుర్రాల వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీజేపీ, బండి సంజయ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ దళిత బహుజనుల పార్టీ అని, దేశంలో అత్యధిక దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిగిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఒక దళిత ఎమ్మెల్యే గా మానకొండూరు నియోజకవర్గం లో దళితులకు ఏం న్యాయం చేశావో చెప్పాలని, వారికి ఎన్ని డబుల్ బెడ్ రూంలు కట్టించావని, దళిత బందు హమి ఏమైంది అని రసమయిని సూటిగా ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండలంలోని కొండపల్కల గ్రామ దళిత కాలనీలో సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రారంభించారని గుర్తు చేశారు. ఇకపై అర్ధరహిత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 12:47PM