- గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో కరోనా సోకి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పందిల్ల గ్రామానికి చెందిన బుర్ర పురుషోత్తం(35} మృతి చెందాడు. గత వారం రోజులుగా కరోనా చికిత్స చేసుకున్నప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. కరోనాతో వ్యక్తి మృతి చెందడం తో అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకొని పందిల్ల గ్రామ సర్పంచ్ తోడేటి రమేశ్ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ శివారులో జేసిబితో తీసిన గుంతను తీసి పూడరు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోడేటి రమేష్, ఉప సర్పంచ్ నెల్లి శ్రీనివాస్, వార్డ్ మెంబెర్స్ ఎల్లయ్య, సంపత్, పద్మా శంకర్ రెడ్డి, సిబ్బంది పాల్గోన్నారు..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 01:09PM