- వీఆర్వో శ్రీకాంత్ తలుపు తొలగించి పెట్రోల్ డబ్బాను లాక్కున వైనం
-న్యాయం చేయాలని తహసిల్లో బైఠాయించిన టీఆర్ఎస్ మహిళా నేత సుగుణ
- అభివృద్ధి పేర స్థానిక ప్రజాప్రతినిధులు గూడును కూల్చివేశారని రోదన
- టీఆర్ఎస్ లో చేరి 15 ఏండ్లు నష్టపోయానని వేల్లడి
- ఇల్లు కావాలని కాళ్ళు మొక్కిన ప్రజాప్రతినిధులు కనికరించడంలేదని అవేదన
- పార్టీకి పనిచేశాను..ఇల్లు కావాలని సుగుణ డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి
ఉదయం కాల సమయంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కార్యలయాన్ని శుభ్రం చెయడానికి తలుపులు తెరిచి లోనికి వేళ్ళారు.ఇంతలోనే ఒక మహిళ పెట్రోల్ డబ్బాతో తహసిల్దార్ కార్యాలయంలోని నాయిభ్ తహసిల్దార్ గదిలోకి వెళ్ళి తలుపుల గడియ బిగించుకొని స్వీయనిర్భందం చేసుకుంది.ఇంతలోనే సమాచారం తెలుసుకున్న వీఆర్వో హుటాహుటిన కార్యాలయానికి చేరుకుని తలుపుల గడియను తోలగించి మహిళా చేతులోంచి పెట్రోల్ డబ్బాను లాక్కున్నాడు.ఈ సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.డబుల్ ఇల్లు రాలేదనే మనస్థాపంతో టీఆర్ఎస్ పార్టీ మాజీ మహిళ మండలాద్యక్షురాలు ఇరుమల్ల సుగుణ తన అవేదన వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే రసమయి బాలకీషన్,స్థానిక ఎంపీపీ భర్త లింగాల లక్ష్మన్ డబుల్ ఇల్లు కేటాయిస్తామనే హామీ మేరకే మండల కేంద్రంలోని రోడ్ల విస్తరణ కార్యక్రమానికి తన ఇల్లు కూల్చివేసి శ్రీకారం చుట్టానని రోదించింది.
గత 15 ఏండ్ల క్రితం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారని..నాటి నుండి పార్టీ బలోపేతానికి నా శక్తుల కృషి చేశానని.. టీఆర్ఎస్ పార్టీలో చేరి తీవ్రంగా నష్టపోయానని నాడు అభివృద్ధి పేరున స్థానిక ప్రజాప్రతినిధులు మాయమాటలు చెప్పి నా ఇల్లును కూల్చివేసి నేడు అనర్హులకు ఇండ్లు కేటాయించి నేడు నాకు అన్యాయం చేశారని అవేదన వ్యక్తం చేసింది.కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని డబుల్ కేటాయించాలని పలుమార్లు ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించి కాళ్ళు మొక్కిన కనీసం ఎవ్వరూ కనికరించలేదని.. టీఆర్ఎస్ పార్టీకి నా శక్తి మేరకు పని చేశాను.. ఉద్యోగం అడగడంలేదు.. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు మాత్రమే ఇల్లు కావాలని ప్రాదేయపడుతున్నాను..నాకు డబుల్ ఇండ్లలో ఇల్లు కేటాయించే వరకు తహసిల్దార్ కార్యాలయంలో నుండి వేళ్ళనని తెలిపింది.ఈ ఘటనపై తహసిల్దార్ విజయ్ ప్రకాష్ రావును వివరణ కోరగా 48 డబుల్ ఇండ్లకు సుమారు 1400 మంది దరఖాస్తులు చేసుకున్నారు.జిల్లా పరిపాలనాధికారి, ఆర్డీఓ అధికారుల అధేశాల మేరకు లబ్దిదారులను ఎంపిక చేశారు.ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను పై అధికారులకు అందజేస్తాం.వారి అధేశాల మేరకు తగిన చర్యలు చేపడుతామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 01:44PM