నవతెలంగాణ - భిక్కనూర్
దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ పంపిణీ లో మోచి కులస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు కామారెడ్డి జిల్లా మోచి కులస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గడ్డమీది సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డుపై చెప్పులు కొట్టుకుంటున్న మోచిలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ పంపిణీ లలో మొదటి ప్రాధాన్యత అందజేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
ఈ వినతి పత్రం కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి రాజాబాబు, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, గంగాధర్, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm