- పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి.
నవతెలంగాణ-గోవిందరావుపేట
నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతం అభివృద్ధి చెందాలని అహర్నిశలు ఎమ్మెల్యే సీతక్క కృషి చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మెన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో పస్రా గ్రామంలోని టీచర్స్ కాలనీ రోడ్డుకు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఫండ్ నుంచి మంజూరు అయిన సిసి రోడ్డు పనుల ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులు ప్రారంభించి మాట్లాడారు. సుమారు 10 లక్షల రూపాయలతో 230 మీటర్లతో సీసీ రోడ్డును ప్రారంభించామని అన్నారు. ఇంతకుముందు కూడా ఘాట్ రోడ్డును ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని ఇప్పుడు సీసీ రోడ్డు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే సీతక్క ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా గ్రామ సర్పంచ్ ముద్దబోయిన రాము, గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దం లింగారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సుధాకర్. జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పంగ శ్రీను, తొట్టి యాకయ్య, రామిడి ప్రతాప్ రెడ్డి, ఏనుగు సునీత, ముద్రకోళ్ల తిరుపతి, యాస సత్తిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 05:33PM