నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
భారతదేశంలో శ్రామిక వర్గం రాజ్య స్థాపనే లెనిన్ కు నిజమైన నివాళి అని, దోపిడి వర్గ రాజ్యాన్ని కూలదోయడమే లక్ష్యంగా పనిచేయాలని సీపీఐ (ఏం - ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. లెనిన్ 98 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల తో నివాళ్లు అర్పించారు. అనంతరం పాపయ్య మాట్లాడుతూ భారతదేశంలో శ్రామిక వ్యవసాయం భూమి నుండి పారి శ్రామిక వర్గం వరకు మొత్తం కూడా శ్రమదోపిడి జరుగుతుందన్నారు. ఈ దోపిడీ రాజ్యాన్ని కూల్చి శ్రమజీవుల రాజ్యం స్థాపించడం వల్లనే అందరికీ సమాన హక్కులు, సమానత్వం అసమానతలు లేని రాజ్యాన్ని స్థాపించడానికి ఉంటుందని అదే విషయాన్ని లెనిన్ రష్యా లో నిరూపించడం జరిగిందని అన్నారు. మావో చైనాలో కూడా నిరూపించడం, ఇంకా క్యూబా, వెనిజులా తదితర చిన్న దేశాల్లో కూడా సోషలిస్టు వ్యవస్థ గా అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పారు. అక్కడ సోషలిస్టు రాజ్యాల వల్లనే శాస్త్ర సాంకేతికంగా ఆదేశాలను అభివృద్ధి చెందయని, భారత దేశంలో కొంత మంది దగ్గర మాత్రమే డబ్బు కేంద్రీకృతమై లక్ష కోట్లకు వారి సంపాదన కరోన కాలంలో కూడా పెంచుకున్నటువంటి పరిస్థితిని దేశ ప్రజలందరూ గమనించాలి అని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను తీసుకురావడం, పాలనలో, రాజ్యాంగంలో మార్పులు చేయడం తరచుగా జరుగుతున్నాయని, ఇది ఏ మాత్రము భారత దేశ ప్రజానీకానికి మేలు చేయవన్నారు. ఇంకా ఆకలిచావులు, బాల్యవివాహాలు వైపు నెట్టివేయడానికి ఈ పాలకుల విధానాలు పని చేస్తాయని ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కార్యదర్శి శివ కుమార్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్,నగర ఉపాధ్యక్షులు జాదవ్ సాయి కృష్ణ, పివైఎల్ జిల్లా నాయకులు బాస్కర్ ప్రజాసంఘాల నాయకులు రాజు ,మోహన్,దేవిక లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 05:43PM