నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
కోటగిరి మండల్ జైనాపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం తరలివచ్చి తమ భూములను కబ్జా చేస్తున్నా వారిని శిక్షించాలని కోరుతూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం సర్వే నెంబర్ 66 లోని స్థలం 33 మంది రైతులకు 20 గుంటల చొప్పున ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆ భూమిలో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మాత్రమే పంట పండించుకోని జీవనం కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. అట్టి భూమిని సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అండదండలు చూసుకొని పత్తి సాయిలు స్థలాన్ని కబ్జా చేసుకొని భయభ్రాంతులకు గొడవలకు దిగుతున్నారని బాధితులు వాపోయారు. భూమి సర్వే చేయడానికి వచ్చిన అర్ఐ, తాహసిల్దార్ లకు లంచం ఆశ చూపి అక్కడ ఉన్న వారందరికీ ఆందోళనకు గురి చేశారు అని ఆరోపించారు. సర్పంచ్ పై ఫిర్యాదు చేసినా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తీసుకోవడం లేదని అన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 05:52PM