జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుకర్.
నవతెలంగాణ-మంథని
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విశేష కృషి చేస్తుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథని పట్టణంలో జేబీఎస్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు కలిసి భూమి పూజ,శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో 90 శాతం పాఠశాలల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందన్నారు. రూ.కోట్ల నిధులతో పాఠశాలలకు మౌలిక వసతులు,అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని,జడ్పీ నిధులతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు నిధులను కేటాయించిఈ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు.పేద విద్యార్థుల సౌకర్యార్థం కోసం పాఠశాల అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్,జెడ్పిటిసి తగరం సుమలత- శంకర్ లాల్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాంభట్ల సంతోషినీ, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్,పట్టణ శాఖ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ,వార్డు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,పలువురు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 05:58PM