నవతెలంగాణ-మంథని
వీధి చిరు వ్యాపారస్తులు ఇంత ముందు తీసుకున్న స్ట్రీట్ వెండర్స్ రుణాలను చెల్లించి,మళ్ళీ బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు.మంథని మున్సిపాల్టీ కార్యాలయంలో శుక్రవారం పుట్ట శైలజ ఆధ్వర్యంలో వీధి వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతకుముందు రూ.10వేల రుణాలను బ్యాంకుల నుండి తీసుకోవడం జరిగిందని, బ్యాంకు రుణాలు చెల్లించిన వీధి వ్యాపారస్తులకు మళ్ళీ రూ.20వేల తీసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జె శ్రీనివాస్ రెడ్డి,మెప్మా పిడి అర్బన్, డిఎంసి రజని,ఏడిఎంసి మౌనిక, వార్డు కౌన్సిలర్ లు గుండ విజయలక్ష్మి పాపారావు,కుర్ర లింగయ్య.కాయితీసమ్మయ్య,నక్క నాగేంద్ర శంకర్,సత్యనారాయణ, కొట్టే పద్మ రమేష్,శ్రీపతి బానయ్య, వికే రవి, పి.రమా,జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ,మున్సిపల్ కార్యాలయ అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 06:07PM