నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని సాయిపేట గ్రామంలో నిరుపేద వృద్ధులకు టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ చార్జి రైతు బంధు సమితి చైర్మన్ సోంపల్లి కర్ణాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య,తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా డి సి సి బి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డిల సహాయ సహకారాలతో గ్రామంలోని నిరుపేద వృద్దులకు బెడ్ షీట్లు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్, ఉప సర్పంచ్ మారగోని రాజు, మండల బీసీ సెల్ మారగోని లక్ష్మీ నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి కుమార్, మాజీ సర్పంచి ముక్కెర రమా - మల్లేశం, మాజీ సర్పంచి బుర్రి రాజయ్య, మాధం కుమార్, ఎం డి రహీం, జోగాల నాగేంద్రం, బుద్దె ముత్తయ్య, బొడపట్ల వెంకటరాజ్యం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 06:28PM