నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన శ్యామల రణధీర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు శుక్రవారం నమోదైనట్లు ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు. పసర ఎస్ ఐ సిహెచ్ కరుణాకర్ రావు తెలిపిన వివరల ప్రకారం.. ప్రకారం మచ్చాపూర్ గ్రామానికి చెందిన 27 ఏండ్ల శ్యామల రణధీర్ పండుగ కు ముందు ఈ నెల 8 న తన స్వగ్రామమైన మచ్చా పురానికి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. తిరిగి ఈ నెల 12న హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే 18 తారీఖు వరకు కూడా తాను చేస్తున్న ప్రదేశానికి చేరుకోకపోవడంతో అతని తల్లి ఆందోళన చెంది బంధువులు తెలిసిన ప్రదేశాలలో వెతికింది. అయినా ప్రయోజనం లేకపోయింది. రణదీర్ పనిచేస్తున్న ఏరియాలో సంప్రదించిన కూడా వారు రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో రణధీర్ తల్లి శ్యామల రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ రావు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 06:54PM