నవతెలంగాణ-భిక్కనూర్
మా ఫ్లాటు మాకు ఇప్పించండి లేదా మా కుటుంబం మొత్తం చావడానికి అనుమతివ్వండి అని బాధిత కుటుంబ సభ్యులు మండలంలోని ప్లాట్ వద్ద ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు మణెమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మణెమ్మ భర్త బత్తుల రాజేందర్ 2012 సంవత్సరంలో రోడ్డు ప్రక్కన ఉన్నా 144 గజాల స్థలాన్ని 75 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన అకస్మాత్తుగా మరణించాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఆ స్థలం తనదంటూ, ఎవరు అమ్మారని ప్రశ్నిస్తూ దౌర్జన్యంగా స్థలంలో ఉన్న హద్దులను తీసేశారు. దాంతో మృతుడి భార్య మణెమ్మ అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తమ బాధను మొరపెట్టుకుంది. ఎవరి కాళ్ళు పట్టుకున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. శుక్రవారం ప్లాటు స్థలంలో ఆమె ఫ్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తన స్థలం తనకు ఇప్పించాలని లేకపోతే ఇదే స్థలంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామన్నారు. భర్త మరణించిన తర్వాత తన పిల్లల పోషణకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని, ఉన్న ఒక్క స్థలం కూడా కబ్జా చేయడంతో తమ కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 07:08PM