నవతెలంగాణ- తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవుళ్లను శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్మెన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబారి సల్మా రావు సకుటుంబ సపరివారంగా దర్శించుకున్నారు. పూజారులు మతాధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం విద్యార్థులతో ఘనంగా స్వాగతం పలికారు. వన దేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సారె నూతన వస్త్రాలు గాజులు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువా కప్పి సన్మానించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక మేడారానికి అధిక నిధులను వెచ్చించి జాతర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూశెట్టి రమేష్, మాజీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, అధ్యక్షులు పోగు నాగేష్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, ఎమ్మెల్యే బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 07:57PM