జన విజ్ఞాన వేదిక నిజామాబాద్
నవతెలంగాణ కంటేశ్వర్
జన విజ్ఞాన వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ కార్యవర్గం శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ను కలిసి గత పది రోజుల కిందట రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో మంత్ర చేస్తున్నారని ఓ మహిళ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అమ్మవార్ల పేర్లతో పూనకాలు వచ్చి వ్యక్తిగత పగ సాధింపుల కొరకు అమాయకులను రెచ్చగొట్టి హత్యలకు తీసే పరిస్థితి తీసుకొస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వారు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ ఆరు మాట్లాడుతూ.. ఇలాంటి పూనకాలు వచ్చేవారిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని.. నేటి ఆధునిక యుగంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే తమ జన విజ్ఞాన వేదిక సంస్థ పోలీసులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈనెల 28వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటలకు కూనెపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇంద్రజాల ప్రదర్శన తో కూడిన సైన్స్ అవగాహన కళాజాత కార్యక్రమం ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి పోలీసు కమిషనర్ నాగరాజు ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగిందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు నార్రా రామారావు, జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింలు, ప్రధాన కార్యదర్శి జి గంగాధర్ జి.వెంకట మల్లయ్య లవోల సాయి, మిమిక్రీ రాజు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 08:00PM