-తుది జాబితాలో అధికారులు పేరు తొలగించారని రాజు అవేదన
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని డబుల్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అనర్హులకు ఇండ్లు కేటాయించారని మండల కేంద్రానికి చెందిన బొండిమల్ల రాజు శుక్రవారం జిల్లా కలెక్టర్ కు సామాజిక మాధ్యమం ద్వారా పిర్యాదు చేశారు. గత జాబితాలో తనను ఎంపిక చేసి తుది జాబితాలో తన పేరును అధికారులు తోలగించారని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. డబుల్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అధికారులు సమన్యాయం పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లో విధులు నిర్వహిస్తూ అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇండ్ల కేటాయింపులో సమగ్ర విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm