నవతెలంగాణ రాజంపేట
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 6 గ్రామాల బీజేపీ కార్యకర్తల సమావేశం రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అసెంబ్లీ ఇన్ చార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి హాజరయ్యారు. మండల కేంద్రంలోకి రాగానే మహిళలు వారికి మంగళహారతులతో స్వగతం పలికారు. అనంతరం సాయిబాబా గుడిలో పూజలు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క కుటుంబానికో, ఒక్క వ్యక్తికో చెందిన పార్టీ బీజేపీ పార్టీ కాదు అన్నారు. బీజేపీ లో కార్యకర్త నుండి ప్రధాని వరకు అందరూ సమానమే అని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకో, పోలీసుల కేసులకో భయపడే రకం కాదని నమ్మిన సిద్ధాంతం కోసం తప్ప దేనికి బీజేపీ కార్యకర్తలు లొంగరు అని అన్నారు. వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే అంతే వేగంగా సమాధనం చెపుతారని అన్నారు. కార్యకర్తలు సమిష్టిగా ఈ రెండు సంవత్సరాలు బూత్ స్థాయిలో కష్టపడితే తర్వాత భవిష్యత్తు అంతా బీజేపిదే నని అన్నారు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా బీజేపీ కార్యకర్తలు అండగా ఉండాలని, బీజేపీ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోస ఇచ్చారు, శివాయిపల్లి గ్రామానికి చెందిన 10 మంది మహిళలు బిజెపి పార్టీలో చేరడం చాలా సంతోషమని అన్నారు. ఆడపడుచులు బీజేపీలో చేరాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, శివాయిపల్లి ఉప సర్పంచ్ సంధ్య, నాయకులు సంపత్, నవీన్, శ్రీనివాస్, రమేష్, మనోహర్, దుర్గ ప్రసాద్, శాంతన్, రఘు, రాజు, నవీన్, శ్రీకాంత్, సాయిరెడ్డి లతో పాటు 400 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.