ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్
నవతెలంగాణ చివ్వెంల :
ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పాచ్య నాయక్ తండాలో జరిగిన కళా జాత అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోన పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించి మాస్క్ లు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ సారధి, కళా కారులు పాలకుర్తి శ్రీకాంత్, పల్లెల రాము, గంట భిక్ష పతి, పాక ఉపేందర్, కుందమల్ల నాగలక్ష్మి, గజ్జి మంజుల తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm