నవతెలంగాణ-గోవిందరావుపేట.
ప్రతి ఆటలోనూ గెలుపే ప్రధాన లక్ష్యంగా ఆడాలని టి పి సి సి కార్యదర్శి పైడాకుల అశోక్ అన్నారు.
శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో తాడ్వాయి గ్రామ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర మరియు తాడ్వాయి ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. అట్టి క్రికెట్ పోటీలలో పాల్గొని విజయం సాధించిన మంగపేట జట్టుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పైడాకుల అశోక్ కుమార్ ప్రోత్సాహకరంగా ప్రథమ బహుమతిగా 10,016/- రూపాయలు అందించి తన ఉదారతను చాటుకున్నారు. అలాగే ప్రథమ బహుమతి అందుకున్న మంగపేట జట్టును పైడాకుల అశోక్ కుమార్ అభినందించారు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి మంగపేట మండలానికి మంచి పేరుని తీసుకురావాలని అన్నారు. ఇలాంటి విజయాలు ఎన్నో సొంతం చేసుకోవాలని ఆయన జట్టు సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ప సునీల్ దొర మాట్లాడుతూ పైడాకుల అశోక్ కుమార్ ఏ కార్యక్రమం అయిన ములుగు జిల్లాలో ముందుండి నడిపిస్తూ, సీతక్క బాటలో నడుస్తూ, అనునిత్యం పేదలకు సేవలు చేస్తూ అనతి కాలంలోనే జిల్లాలో తిరుగులేని నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నాడు అన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోతూ, అందరిని తనవాడిగా కలుపుకుంటూ పోతూ, అందరి హృదయాలలో ప్రత్యేఖ అభిమానాన్ని సంపాదించుకున్నాడని చెప్పారు. తాను ఒక్క మాట అడగగానే నా మాటను గౌరవించి 10,016/- రూపాయల ప్రథమ బహుమతి అందించి తన మంచి మనసును చాటుకున్నారన్నారు అలాగే ద్వితీయ బహుమతి తాడ్వాయి మండలానికి చెందిన ఇంద్రనగర్ జట్టు గెలుచుకుంది అని ఆ జట్టుకు ద్వితీయ బహుమతి యువ నాయకుడు అర్రేమ్ లచ్చుపటేల్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడని అన్నారు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు పులి సంపత్, ఎస్.సి. సెల్ మండల అధ్యక్షుడు వావిలాల రాంబాబు, సహకార సంఘ సభ్యులు యానాల సిద్దిరెడ్డి, రంగరబోయిన జగదీష్, మాజీ జడ్పీటీసీ తాడ్వాయి బొల్లు దేవేందర్, తాడ్వాయి యూత్ అసోసియేషన్ సభ్యులు ముసిక ప్రవీణ్, ఆకుల పవన్, తాటికొండ రాజు, బంగారు అజయ్, మోకాళ్ళ శ్రీను, తాటి నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 08:53PM