- అధికారుల అనాలోచిత నిర్ణయం
- ఇబ్బంది పడుతున్న వాహన యజమానులు ప్రయాణికులు
- నియంత్రణ చర్యలు చేపట్టాలి స్థానిక ప్రజలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మహా జాతర వాహనాలతో పసరలో ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతిరోజు మేడారం మహాజాతర సందర్శనార్థం వాహనాలు అధిక సంఖ్యలో వస్తుండడంతో పసర మేడారం ఆర్చి సెంటర్ లో వాహనాలు నిలబడి పోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. పసర నుండి మేడారానికి వేస్తున్న నూతన రహదారి ఇంజనీర్ లోపాలతో ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం జలమయం అయింది. దీనితో ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో స్పందించిన కాంట్రాక్టర్ వెంటనే జెసిబి తో సుమారు 50 మీటర్ల బారు వన్ సైడ్ కందకం తీయాల్సి వచ్చింది. వర్షపు నీటి సమస్య పరిష్కారం కాగా తీసిన కందకం వల్ల కొత్త సమస్య మొదలైంది. కందకం తీసే సమయంలో కందకం తీసిన భాగము మరియు జెసిబి తోడిన కంకర కుప్పలు వేసిన భాగంతో దాదాపు పావు భాగం రోడ్డు నిరుపయోగంగా మారింది. దీనితో తరచు వాహనాల సంఖ్య పెరిగినప్పుడల్లా అక్కడ వాహనాలు జామ్ కావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ పరిస్థితి ఒక సమయంలో అరగంట వరకు కొనసాగుతోంది వాహనదారుల సమన్వయ లోపంతో ఇది ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని దీనివల్ల జాతరకు వచ్చే వారికి స్థానికులక ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. కందకం తోడి పది రోజులు పైబడుతున్న ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని స్థానిక వ్యాపారులు అంటున్నారు. వ్యాపారం నడిచేది ఈ నాలుగు రోజులు అనుకుంటే కంధకం వల్ల దాటలేక కొనుగోలుదారులు షాపుల వరకు రాలేక పోతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై సిపిఎం నాయకులు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వాహనాల జాము వల్ల చిన్నచిన్న వాహనాల యజమానులు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి
గాయాల పాలు అవుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని స్థానికులు అంటున్నారు. ఆర్అండ్ బీ అధికారులు గుత్తేదారు వెంటనే స్పందించి రహదారి మరమ్మలు చేయించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మంగళవారం సంత జరిగే ఈ సమయంలో సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని వారు తెలుపుతున్నారు.
ప్రమాదాల నివారణకు పంచాయతీ అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి:
- సప్పిడి ఆదిరెడ్డి, పసరా గ్రామస్తుడువాహనాలు జాబ్ కాకుండా ప్రమాదాల నివారణకు పంచాయతీ అధికారులు కూడా చొరవ చూపాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. పంచాయతీ అధికారులు మరియు ఆర్అండ్ బీ అధికారులు సమన్వయంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే జాతర పూర్తయ్యే వరకు తాత్కాలిక సిబ్బందిని నియమించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాలి. వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్న విషయాన్ని గుర్తించి బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 04:30PM