- పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు...!!
నవతెలంగాణ-మంథని
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి లేని,అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ పై పంచాయతీ రాజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళిఆదేశాలు జారీచేశారు. వివరాల్లోకి వెలితే మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 329/ఏ3,329/ఏ4లో ప్రభుత్వ, పంచాయతీ అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్, నూతన భవననిర్మాణం చేస్తున్నారని, నిబంధనల ప్రకారం పంచాయతీకి పది శాతం భూమి, మౌళిక వసతులు, రోడ్లు లేకుండా వెంచర్ ఏర్పాటుపై గత నెల 23న జిల్లా పంచాయతీ అధికారికి మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్, అనుమతి లేని నిర్మాణంపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 113,114 ప్రకారం తక్షణం చర్యలుగైకొని, తీసుకున్న చర్యల నివేదికను అందజేయాలని మంథని మండల అభివృద్ధి అధికారికి,మండల పంచాయతీ అధికారికి, సూరయ్యపల్లి పంచాయతీ జూనియర్ కార్యదర్శికి తగు ఆదేశాలు జారీ చేస్తూ శుక్రవారం రోజున జిల్లా పంచాయతీ అధికారి ఒక లేఖను జారీచేశారు. మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అక్రమ వెంచర్ పైస్పందించిన జిల్లా పంచాయతీ అధికారికి మంథని మాజీ ఉపసర్పంచ్, డిపిటేడ్ ఎమ్మెల్సీ ఇనుముల సతీష్ ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 04:42PM