నవతెలంగాణ-మంథని
మంథని పట్టణానికి చెందిన గుంటుపల్లి సమ్మయ్య, కావటి సమ్మయ్యలు సిలంబం పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులగా నియామకమయ్యరు.ఈనెల 20వ తేదీన రాష్ట్ర సిలంబం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిజామాబాదు లో జరిగిన సమావేశంలో వీరిని జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. అనంతరం సిలంబం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పన్నీర్ శ్రీనివాస్ లు నియామక పత్రాలను అందజేశారు.మా నియామకానికి కృషిచేసి మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి, ప్రధాన కార్యదర్శి పన్నీర్ శ్రీనివాసులకు జి.సమ్మయ్య,
కె సమ్మయ్యలు కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm