నవతెలంగాణ-మంథని
మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు కోవిడ్ భారిన పడిందని విషయం తెలుసుకున్న ఖానాపూర్ ప్రజా సేవ సమితి సభ్యులు శనివారం కోవిడ్ భాదితురాలికి మనోధైర్యం చెప్తూ సహాయ నిమిత్తం పండ్లు, నిత్యావసర వస్తువులు వృద్ధురాలి బంధువులకు అందజేశారు. అంతేకాకుండా ఎప్పుడు అవసరం వచ్చిన మమ్మల్ని సంప్రదించగలని ఖానాపూర్ ప్రజా సేవ సమితి సభ్యులు తెలిపారు. గతంలో కూడా ఖానాపూర్ గ్రామంలో కోవిడ్ వచ్చిన వారికి, ఆపదలో ఉన్న వారికి ఖానాపూర్ గ్రామ యువకులు వారి సహకార కార్యక్రమంలో ముందు నిలుస్తుడడం పట్ల ఆ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm