- సర్పంచ్ ముద్ద బోయిన రాము
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఉపాధి హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ముద్ద బోయిన రాము అన్నారు. శనివారం మండలంలోని పసర పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము కూలీల మస్టర్ లను పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో పని చేయండి కూలీలు వెంటనే తమ పూర్తి పనుల కోసం కార్యాలయ సిబ్బందిని సంప్రదించి బ్యాలెన్స్ పనులు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. కూలీల అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఉపాధి కూలీల పనులను ఎప్పటికప్పుడు కొలతలు వేసి వారికి డబ్బులు సకాలంలో పడే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పూనం శరత్ బాబు, జి ప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 04:56PM