- కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్
నవతెలంగాణ-గోవిందరావుపేట
సమయం సమీపిస్తున్నందున సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ కోరారు. శనివారం మండలంలోని చల్వాయి రంగాపూర్ గ్రామాలలో డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ నమోదు ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశం మేరకు ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగించాల్సి ఉండగా ఆలస్యం జరుగుతోందని నమోదు ను మరింత వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో మండలాన్ని అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత స్థానిక నాయకులు అన్న విషయాన్ని గుర్తించి నమోదు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. బూత్ ఎన్ రోలర్లు అవసరమైతే స్థానిక కార్యకర్తల సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చాపల ఉమాదేవి, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, మండల మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు పాలడుగు వెంకటకృష్ణ, బూత్ ఎన్ రోలర్లు చాపల కిషన్ రెడ్డి, రేగా కృష్ణ, వంక సాంబయ్య, ఎలుగొండ సుధాకర్, కొట్టేం కృష్ణ, వాసం సునీల్, ఇర్ప కన్నయ్య, ఎలుగొండ శివయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 04:58PM