నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్ముకోవడానికె ప్రభుత్వం భూముల రేట్లను పెంచుతుందని ఇఫ్టు, పి.డి.ఎస్.యూ నాయకులు యం.శివ కుమార్,జన్నారపు రాజేశ్వర్ లు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు ఐఎఫ్టియు, పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఒక వైపు ప్రజలు తల్లడిల్లుతుంటే మరొక వైపు ప్రభుత్వ ఖజానాను పెంచుకోవడానికి రాష్ట్రంలో భూముల రేట్ల పెంపు నిర్ణయన్నీ తీసుకుంటున్నారని అన్నారు. వ్యవసాయ భూముల విలువ 50 శాతం స్థలాల విలువను 35 శాతం అపార్ట్ మెంట్ ప్లాట్ల విలువను 20 శాతం రేట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని వలన సామాన్య పేద ప్రజలు నివాసం ఉండడానికి ప్లాట్లను కొనలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. అదేవిదంగా గతంలో కొకపేట భూములను ప్రభుత్వం అమ్ముకుందాని, రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ భూములను ప్రభుత్వం అమ్మే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. కావున ప్రభుత్వం పెంచిన భూముల రేట్లను తగ్గించాలని, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా హేతుబద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారం వేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు మోహన్, రాజు, పి.డి.ఎస్.యూ నగర ఉపాధ్యక్షులు జాదవ్ సాయి కృష్ణలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 05:52PM