- మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి నినదించిన జర్నలిస్టులు
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల సాక్షి రిపోర్టర్ కమలాపురం పోశెట్టి పై రాజకీయ గూండాలు దాడి చేసిన సంఘటనపై శనివారం మధ్యాహ్నం జిల్లా జర్నలిస్టులు రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలెక్టరేట్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు. దోషులను కఠినంగా శిక్షించాలని నిందితులపై హత్యానేరం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రికి జర్నలిస్టులు విన్నవించారు.వార్తలు రాస్తే దాడులు చేస్తారా? కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు రంజిత్,మహేందర్ లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు.
బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయనపై అక్రమ కేసును నమోదు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జర్నలిస్టులు ముక్తకంఠంతో మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఎంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని కావున వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ఐజెయు జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, రాజలింగం, యూనియన్ ప్రతినిధులు భద్రరెడ్డి, ప్రభాకర్, దేవిదాస్, శేఖర్, ప్రసాద్, కిషన్, మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 06:29PM