- రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరుపై మంత్రి తన్నీరు హారీష్ రావు ధ్వజం
- మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన
- బీజేపీ గ్లోబల్ ప్రచారం మానుకుని.. మాటల్లో కాదు చేతల్లో చూపాలని సూచన
- చేతనైతే దళిత బందును దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆగ్రహం
- 317జీవో రద్దుచేయడమంటే రాష్ట్రపతి ఉత్తర్వులను బీజేపీ తప్పుపట్టడమే..
- సింగరేణి,ఉద్యోగులపై బీజేపీకి ప్రేముంటే అదాయపన్ను మినహాయింపు ఇవ్వాలి
- రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బందు అమలు చేసిన సీఎం కేసీఆర్
- డబుల్ ఇండ్ల పంపిణీ ఆరంభమే..దశలవారిగా అర్హులందరికీ అందజేస్తామని సూచన
- ఇల్లు రాలేదని..మంత్రి పర్యటనలో పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో బాధితుల అందోళన
నవతెలంగాణ-బెజ్జంకి
కుల, మత, వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమని.. అధికారం కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర బీజేపీ నాయకులపై ధ్వజమేత్తారు. శనివారం మండల కేంద్రంతో పాటు రేగులపల్లి, చీలాపూర్ గ్రామాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించి డబుల్ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్లు పంపిణీ చేసి నిర్మాణం పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి.. నిర్మాణం చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మండల కేంద్రంలో డబుల్ ఇండ్ల ఎంపికలో అర్హులకు అధికారులు అన్యాయం చేశారని పలువురు బాధితులు మంత్రి హరీష్ రావుకు గోడును విన్నవించుకొవాడానికి వేచియుండగా పోలిసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు పోలిసుల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి హరీష్ రావు బాధితుల వినతిపత్రాలు తీసుకుని రూ.2కోట్ల నిదులతో చేపట్టనున్న మిని స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసి బీపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అర్హులందరికి డబుల్ ఇండ్లు అందజేస్తామని ఇండ్లు రాలేదని నిరుపేదలు ఆందోళన చెందవద్దని ఇండ్ల పంపిణీ ఆరంభమేనని.. దశలవారీగా డబుల్ ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. దళిత బందు పథకం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మార్చి 31 వరకు నియోజకవర్గాల్లోని 100 మంది లబ్ధిదారులకు దళిత బందు అందజేస్తామని.. తర్వాత మరో రూ.20 వేల కోట్లు దళిత బందు పథకానికి కేటాయిస్తామన్నారు.
బీజేపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని చేతనైతే దేశవ్యాప్తంగా దళిత బందు పథకాన్ని అమలు చేయాలని ఆకగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టారని.. బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో దళితులను ఊచకోత కొస్తున్న పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను చూస్తూ వికటనందం పోందుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని... రాష్ట్రంలోని 9లక్షల 96 వేల మంది ఆడపిల్లల వివాహానికి కల్యాణ లక్ష్మి అందించిందని మరో 4 వేల మందికి అందిస్తే గొప్ప మైలురాయిని చేరుకుంటామన్నారు. బీజెపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని..317జీవోను రద్దు చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టడం బీజేపీ ప్రభుత్వ రాష్ట్రపతి ఉత్తర్వులను బీజేపీ తప్పుపట్టడమేనన్నారు.కుల,మత, వర్గ భేదం లేకుండా స్థానికత ఆధారంగా ఉద్యోగాలు కల్పించడానికి 317 జీవో అమలు చేసామని.. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ నాయకులు కపటనాటకం బందు చేసి సింగరేణి కార్మికులు,ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని హెచ్చరించారు.జెడ్పీ చైర్ పర్సన్ ఏలేటి రోజు శర్మ, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎంపీపీ లింగాల నిర్మల, యా గ్రామాల సర్పంచులు ద్యావనపల్లి మంజుల, జెల్లా ఐలయ్య, రాగుల మొండయ్య, ఎఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజయ్య లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పర్యటనలో డబుల్ ఇండ్ల ఆందోళన...
మంత్రి హరీష్ రావు పర్యటనలో డబుల్ ఇండ్ల ఆందోళన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తన భర్త కరోనా బారినపడి మృతి చెందాడని న్యాయం చేయాలని రోడ్డుపై పిల్లలతో కడమంచి అంజలి బైఠాయించగా, అనర్హులకు డబుల్ ఇండ్లు కేటాయించారని కరవేల్లి సుజాత పురుగుల మందు త్రాగేందుకు యత్నించింది. పోలిసులు గమనించి నిలువరించారు.మూడెకరాల భూపంపిణీలో టీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం వల్ల తన భర్త మంకాలి శ్రీనివాస్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడని.. డబుల్ ఇండ్ల కేటాయింపులో తనకు న్యాయం చేస్తామని హామీలిచ్చి ఎమ్మెల్యే అన్యాయం చేశారని మంకాలి శ్రావణి తన పిల్లలతో కలిసి తన భర్త చిత్రపటాన్ని పట్టుకుని ఆందోళన చేపట్టింది.వటకారి అనిత డబుల్ ఇల్లు రాలేదని పక్కనే నీటీలో పడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులు న్యాయం కోసం మంత్రి హరీష్ రావును కలువాలని పోలిసులను ప్రాదేయపడిన పోలిసులు అవకాశం కల్పించకపోవడం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 06:44PM