నవతెలంగాణ-బెజ్జంకి
ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడంలో అలసత్వం వహిస్తూ ప్రశ్నించే గొంతుకను నిర్భందించేలా అక్రమ అరెస్టులు చేయించడం సిగ్గుచేటని అక్రమ అరెస్టులకు నిరసనగా మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు దిష్టి బోమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు.మాటలతోనే ప్రజలను మభ్యపేడుతూ కాలం వేళ్ళ దీస్తున్న ఎమ్మెల్యే,స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శ చేసుకుని ప్రజా సంక్షేమం,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని ఓబీసి మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కో ఆర్డినేటర్ సాన వేణు సూచించారు.బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm