నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు నేటి యువత నేతాజీ బాటలో పయనించాలని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు నేతాజీ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తరుణంలో ఆయన జై హింద్ అనే నినాదంతో ముందుకు దూసుకెళ్లి ఒక చుక్క రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని అనర్గళంగా చెప్పి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంజిత్ శేఖర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm