నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ )నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడుగా కెంపులు నాగరాజును నియమిస్తూ టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార్ స్వామి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కేంపుల నాగరాజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. నాగరాజు జిల్లాకు అధ్యక్షులుగా నియామకం కావడంపై టీఈఏ రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ చార్జి వేముల రాధికాసురేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీఈఏ నిర్మాణంలో అందరు ఓ సైన్యంలో పని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి, కన్వీనర్ వేముల రాధికాసురేందర్ రెడ్డిలకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm