నవతెలంగాణ-మంథని
సుభాష్ చంద్రబోస్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల.నాగరాజు అన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరన్నారు. ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో ఆయన విగ్రాహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని,అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడి.. వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నిరుద్యోగలకు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ల నాగరాజు,నాయకులు మిటుకు రామ్మూర్తి,మల్యాల రామన్న, గుర్రాల రాజలింగు,లక్కేపురం రాజేందర్,సాదుల శంకర్, సురేష్,బుర్ర శంకర్,పల్లాల సాయి, ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:03PM