నవతెలంగాణ-మంథని
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం కోసం చేసిన పోరాటాన్ని గత 75 ఏండ్లుగా గాంధీ,గాడ్సే రాజకీయాలతో నడిచిన పార్టీలు విస్మరించాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సాగి. అజిత్ కుమార్ అన్నారు. ఆదివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీ ఫోటోలు ఎలా కరెన్సీ నోట్ల మీద ముద్రించారో,అలాగే నేతాజీ ఫోటోలు కూడా భారతీయ కరెన్సీ మీద ముద్రించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను గౌరవించాలన్నారు. భారత ప్రభుత్వం వెంటనే చొరవ చూపి కరెన్సీ నోట్లపై సుభాష్ చంద్రబోస్ ఫోటో ముద్రించాలని ఆయన కోరారు.నేతాజీ 127వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద ప్రధాని మోడీ.. సుభాస్ చంద్ర బోస్ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.అంతే కాకుండా సుభాస్ చంద్ర బోస్ ను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలన్నారు.ఈ విలేకరుల సమావేశంలో నాయకులు చొప్పరి నారాయణ, శేఖర్,కొండేల తిరుపతి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:05PM