నవతెలంగాణ - సిద్దిపేట
స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను సిద్దిపేట వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్టు క్లబ్ అధ్యక్షులు సోమ శివకుమార్ , వనజ లు లో తెలిపారు. ఆదివారం వారు నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ మర్యాల వీరేశం, పెద్ది వైకుంఠం, మురికి అంజయ్య, మాంకాల లలిత, గందె పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో...
సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండూరి మహేష్, పుల్లూరు శివకుమార్, పుల్లూరి శశాంక్, ముక్క విజయ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm